అనంతపురం జిల్లా, కదిరి పట్టణంలోని కుటాగుళ్లలో సాహెబ్బీ, మదార్‌సాబ్ లకు మూడవ సంతానంగా 1924లో జన్మించారు. ప్రాథమిక విద్య కదిరి ఉన్నత పాఠశాలలో చదివారు. డిగ్రీ అనంతపురంలోని ఆర్ట్స్ కాలేజీలో చేశారు. కర్ణాటక రాష్ట్రం బెల్గాంలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. కొంతకాలం ఈయన కదిరి వేమన బోర్డు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తర్వాత సీపీఐ, ఆ తర్వాత సీపీఎంలో చేరినప్పటికీ బ్యాలెట్ ద్వారా సాధించేదేమీ లేదని నమ్మి చార్‌మజుందార్ నాయకత్వంలో నడుస్తున్న సీపీఐ (ఎంఎల్) లో చేరారు. కొన్నాళ్ల తర్వాత కొండపల్లి సీతారామయ్యతో విభేదించి సీపీఐ (ఎంఎల్) రెడ్‌ఫ్లాగ్ పార్టీలో చేరారు. అక్కడ కూడా ఆయనకు నచ్చలేదు. తర్వాత 1999లో సీపీఐ (ఎంఎల్) నక్సల్బరి పార్టీలో చేరి అఖరి దశ వరకు తన పోరాటాన్ని కొనసాగించారు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీలో రవూఫ్‌ను అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపారు. ఆ తర్వాత సాయుధ పోరాటానికి స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి రావాలని దివంగత ఇందిరాగాంధీ ఆహ్వానించారు. తాను బ్యాలెట్‌కు వ్యతిరేకమని చెప్పి సున్నితంగా తిరస్కరించారు. కొంతకాలం సాయుధ పోరాటానికి విరామం చెబుదామని విప్లవ యోధుడు కొండపల్లి సీతారామయ్య చెబితే అది ఈయనకు నచ్చలేదు. అందుకే సీపీఐ (ఎంఎల్) రెడ్‌ఫ్లాగ్ నుంచి బయటికొచ్చారు. కేరళ, పశ్చిమ బెంగాల్లో ఉన్నప్పుడు ఓ సారి నేపాల్ రాజు ప్రచండ.. రవూఫ్‌ను కలిశారరు. ఈయన లా పట్టభద్రుడు కావడంతో తనపై ఉన్న కేసులను తానే స్వయంగా వాదించుకునేవారు. ఎవరి వద్దా సహాయకుడిగా చేరకుండానే నేరుగా న్యాయవాదిగా తన తొలి కేసును తానే వాదించుకున్నారు. కోర్టుకు వస్తున్నారని తెలిస్తే చాలు కదిరి ప్రాంత ప్రజలు ఈయన్ని చూసేందుకు తండోపతండాలుగా వచ్చేవారు.
షేక్ అబ్దుల్లా రవూఫ్ ఎక్కడ జన్మించాడు?
Ground Truth Answers: అనంతపురం జిల్లా, కదిరి పట్టణంలోని కుటాగుళ్లఅనంతపురం జిల్లా, కదిరి పట్టణంలోని కుటాగుళ్లఅనంతపురం జిల్లా, కదిరి పట్టణంలోని కుటాగుళ్ల
Prediction: